Share News

సన్నీ యూటర్న్‌

ABN , Publish Date - Oct 25 , 2024 | 01:57 AM

కివీ్సతో రెండో టెస్టులో మూడు మార్పులు చేయడాన్ని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. ముఖ్యంగా కుల్దీప్‌ స్థానంలో సుందర్‌ను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించాడు. తొలి టెస్టులో...

సన్నీ యూటర్న్‌

కివీ్సతో రెండో టెస్టులో మూడు మార్పులు చేయడాన్ని మాజీ కెప్టెన్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. ముఖ్యంగా కుల్దీప్‌ స్థానంలో సుందర్‌ను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించాడు. తొలి టెస్టులో 46 పరుగులకే ఆలౌట్‌ కావడంతో భారత జట్టు భయాందోళనకు గురైనట్టుందని, అందుకే బ్యాటింగ్‌ చేయగల సుందర్‌ వైపు మొగ్గు చూపారని అన్నాడు. అయితే తొలి రోజు ఆట ముగిశాక సన్నీ మాట మార్చాడు. సుందర్‌ ఎంపిక నిర్ణయం అద్భుతమని కొనియాడాడు. ‘ఇది జట్టుకు ఉపయోగపడే ఎంపిక. బ్యాటింగ్‌, బౌలింగ్‌ చేయగలడు కాబట్టే సుందర్‌ను తీసుకున్నారు’ అని అతడు ఐదో వికెట్‌ను తీశాక గవాస్కర్‌ కామెంట్‌ చేశాడు.

Updated Date - Oct 25 , 2024 | 01:57 AM