Share News

సుమిత్‌.. రన్నరప్‌

ABN , Publish Date - Jun 17 , 2024 | 04:38 AM

వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ నెగ్గాలన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ ఆశలకు బ్రేక్‌ పడింది. పెరూగియా చాలెంజర్‌ ఈవెంట్‌లో సుమిత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది...

సుమిత్‌.. రన్నరప్‌

పెరూగియా (ఇటలీ): వరుసగా రెండో ఏటీపీ చాలెంజర్‌ టైటిల్‌ నెగ్గాలన్న భారత టెన్నిస్‌ స్టార్‌ సుమిత్‌ నగల్‌ ఆశలకు బ్రేక్‌ పడింది. పెరూగియా చాలెంజర్‌ ఈవెంట్‌లో సుమిత్‌కు ఫైనల్లో చుక్కెదురైంది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఆరోసీడ్‌ సుమిత్‌ 1-6, 2-6తో టాప్‌సీడ్‌ లూసియానో డార్దెరి (ఇటలీ) చేతిలో ఓటమిపాలై రన్నర్‌పతో సరిపెట్టుకున్నాడు. సుమిత్‌ గతవారం జర్మనీ టోర్నీలో విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.

Updated Date - Jun 17 , 2024 | 04:38 AM