Share News

సుమిత్‌ @ 77

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:51 AM

భారత టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ కెరీర్‌ బెస్ట్‌ 77వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్స్‌ సింగిల్స్‌ మెయిన్‌ డ్రాకు నగల్‌ అర్హత సాధించే అవకాశాలున్నాయి. సోమవారం తాజాగా విడుదల చేసిన ఏటీపీ

సుమిత్‌ @ 77

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌ కైవసం

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ కెరీర్‌ బెస్ట్‌ 77వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఈ క్రమంలో పారిస్‌ ఒలింపిక్స్‌ సింగిల్స్‌ మెయిన్‌ డ్రాకు నగల్‌ అర్హత సాధించే అవకాశాలున్నాయి. సోమవారం తాజాగా విడుదల చేసిన ఏటీపీ ర్యాంకింగ్స్‌లో నగల్‌ ఏకంగా 18 ర్యాంక్‌లు మెరుగుపరచుకొని 77వ స్థానంలో నిలిచాడు. నిబంధనల ప్రకారం టాప్‌-56 ర్యాంక్‌ ప్లేయర్లకు నేరుగా ఒలింపిక్‌ బెర్త్‌ దక్కనుంది. అయితే, ఒక దేశం నుంచి నలుగురు ప్లేయర్లకు మాత్రమే అనే నిబంధన కారణంగా సుమిత్‌ లాంటి తక్కువ ర్యాంక్‌ ఆటగాళ్లకు అదృష్టం వరించే చాన్సులున్నాయి.

Updated Date - Jun 11 , 2024 | 04:51 AM