Share News

సుమిత్‌దే చెన్నై ఓపెన్‌

ABN , Publish Date - Feb 12 , 2024 | 02:40 AM

సూపర్‌ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత టెన్నిస్‌ సింగిల్స్‌ టాప్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ అదరగొట్టాడు. చెన్నై ఓపెన్‌లో సింగిల్స్‌ చాంపియన్‌గా...

సుమిత్‌దే చెన్నై ఓపెన్‌

టాప్‌-100 ర్యాంకింగ్స్‌లో చోటు

చెన్నై: సూపర్‌ఫామ్‌తో దూసుకెళ్తున్న భారత టెన్నిస్‌ సింగిల్స్‌ టాప్‌ ఆటగాడు సుమిత్‌ నగల్‌ స్వదేశంలో జరిగిన టోర్నీలోనూ అదరగొట్టాడు. చెన్నై ఓపెన్‌లో సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్లో రెండోసీడ్‌ సుమిత్‌ 6-1, 6-4తో ఇటలీకి చెందిన టాప్‌సీడ్‌ లుకా నార్దిని చిత్తు చేశాడు. ఈ ప్రదర్శనతో 26 ఏళ్ల సుమిత్‌ కెరీర్‌లోనే తొలిసారిగా అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకోనున్నాడు. ప్రస్తుతం 121వ ర్యాంకులోనున్న సుమిత్‌.. సోమవారం ప్రకటించే ఏటీపీ ర్యాంకింగ్స్‌లో ఏకంగా 98వ స్థానానికి చేరుకుంటాడు. సుమిత్‌కు ఇది కెరీర్‌లో 5వ ఏటీపీ చాలెంజర్‌ ట్రోఫీ కాగా.. సొంతదేశంలో 2వది.

Updated Date - Feb 12 , 2024 | 02:40 AM