Share News

స్టంపింగ్‌ రివ్యూ.. ఇక ఇలా

ABN , Publish Date - Jan 05 , 2024 | 06:08 AM

స్టంపింగ్‌ నిబంధన దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు వికెట్‌ కీపర్‌ స్టంపౌట్‌కు అప్పీలు చేస్తే..ఫీల్డ్‌ అంపైర్‌ దాన్ని థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేసేవాడు...

స్టంపింగ్‌ రివ్యూ.. ఇక ఇలా

నిబంధనల్ని సవరించిన ఐసీసీ

దుబాయ్‌: స్టంపింగ్‌ నిబంధన దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేలా ఐసీసీ కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటివరకు వికెట్‌ కీపర్‌ స్టంపౌట్‌కు అప్పీలు చేస్తే..ఫీల్డ్‌ అంపైర్‌ దాన్ని థర్డ్‌ అంపైర్‌కు రిఫర్‌ చేసేవాడు. థర్డ్‌ అంపైర్‌ తొలుత బ్యాటర్‌ క్యాచ్‌ అవుట్‌ అయ్యాడేమో పరిశీలించి, ఆ తర్వాత స్టంపౌట్‌ను కూడా చూసేవాడు. ఇక నుంచి అలా జరగదు. కొత్త నిబంధన ప్రకారం..వికెట్‌ కీపర్‌ స్టంపౌట్‌కు అప్పీలు చేస్తే థర్డ్‌ అంపైర్‌ కేవలం ఆ విజువల్స్‌ను మాత్రమే పరిశీలిస్తాడు. క్యాచ్‌ ద్వారా అవుటయ్యాడా లేదా అన్న విషయాన్ని చూడడు. ఒకవేళ క్యాచౌట్‌కు అప్పీలు చేయాలనుకొంటే ఫీల్డింగ్‌ టీమ్‌ ప్రత్యేకంగా డీఆర్‌ఎ్‌సను కోరాల్సి ఉంటుంది. గతనెల 12నుంచే ఈ నిబంధన అమల్లోకి వచ్చింది.

Updated Date - Jan 05 , 2024 | 06:08 AM