Share News

స్టోక్స్‌ మ్యాజిక్‌

ABN , Publish Date - Mar 09 , 2024 | 03:03 AM

సుమారు ఎనిమిది నెలల తర్వాత బంతి చేతపట్టిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలి ఓవర్‌లోనే అబ్బురపరిచాడు. రెండో రోజు తొలి సెషన్‌లో పేసర్లు, స్పిన్నర్లు అంతా తేలిపోవడంతో వారికి ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు.

స్టోక్స్‌ మ్యాజిక్‌

సుమారు ఎనిమిది నెలల తర్వాత బంతి చేతపట్టిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ తొలి ఓవర్‌లోనే అబ్బురపరిచాడు. రెండో రోజు తొలి సెషన్‌లో పేసర్లు, స్పిన్నర్లు అంతా తేలిపోవడంతో వారికి ఒక్క వికెట్‌ కూడా దక్కలేదు. ఇక తప్పదనుకున్న స్టోక్స్‌ రెండో సెషన్‌ను తనే ఆరంభించాడు. అయితే తాను వేసిన మొదటి బంతికే సెంచరీ మీదున్న రోహిత్‌ను బౌల్డ్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతడు విసిరిన గుడ్‌లెంగ్త్‌ బాల్‌ రోహిత్‌ను ఏమార్చుతూ వికెట్‌ను ఎగరగొట్టింది. దీంతో ఈ మ్యాజిక్‌ బాల్‌కు రోహిత్‌ సైతం అవాక్కవుతూ పెవిలియన్‌ చేరాడు. అటు స్టోక్స్‌ సహచరులు కూడా నమ్మలేని విధంగా చూస్తూ అతడిని అభినందించారు.

Updated Date - Mar 09 , 2024 | 03:03 AM