Hockey : గెలుపుతో మొదలెట్టారు
ABN , Publish Date - Jul 28 , 2024 | 06:20 AM
చివరి నిమిషాల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌తో ఒలింపిక్స్‌ను భారత హాకీ జట్టు విజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను

హాకీ
చివరి నిమిషాల్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌తో ఒలింపిక్స్‌ను భారత హాకీ జట్టు విజయంతో ఆరంభించింది. గ్రూప్-బిలో హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించింది. 59వ నిమిషంలో కివీస్ జట్టు ఫౌల్ చేయడంతో టీమిండియాకు పెనాల్టీ స్ట్రోక్ లభించింది. దీన్ని హర్మన్ గోల్‌గా మలచి జట్టును గెలిపించాడు. మన్‌దీప్ సింగ్ (24వ), వివేక్ సాగర్ (34వ) చెరో గోల్ సాధించారు. న్యూజిలాండ్ తరఫున సామ్ లేన్ (8వ), సైమన్ చైల్డ్ (53వ) గోల్స్ చేశారు. గత క్రీడల్లో భారత్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే.