Share News

రోడ్డు ప్రమాదంలో స్టార్‌ అథ్లెట్‌ కెల్విన్‌ దుర్మరణం

ABN , Publish Date - Feb 13 , 2024 | 05:30 AM

మారథాన్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్‌ కెల్విన్‌ కిప్టుమ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం వెస్ట్రన్‌ కెన్యాలో జరిగిన ఈ దుర్ఘటనలో 24 ఏళ్ల కెల్విన్‌తో పాటు కోచ్‌ హకిజిమన కూడా...

రోడ్డు ప్రమాదంలో స్టార్‌ అథ్లెట్‌ కెల్విన్‌ దుర్మరణం

నైరోబి: మారథాన్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన కెన్యా అథ్లెట్‌ కెల్విన్‌ కిప్టుమ్‌ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదివారం వెస్ట్రన్‌ కెన్యాలో జరిగిన ఈ దుర్ఘటనలో 24 ఏళ్ల కెల్విన్‌తో పాటు కోచ్‌ హకిజిమన కూడా మరణించాడు. అలాగే వారితో ప్రయాణించిన యువతి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతోంది. ప్రమాద సమయంలో కారును కెల్విన్‌ నడుపుతున్నాడని, అతివేగం కారణంగానే వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొందని పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబరులో జరిగిన షికాగో మారథాన్‌ (35 కి.మీ)లో 2:00:35 సె. టైమింగ్‌తో కెల్విన్‌ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో తన దేశానికే చెందిన ఎలియుడ్‌ కిప్చోగె (2:01: 09) నెలకొల్పిన రికార్డును అధిగమించడం విశేషం. అలాగే ఇది తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో మూడో రేసు మాత్రమే. త్వరలో జరగబోయే పారిస్‌ ఒలింపిక్స్‌లోనూ కెల్విన్‌ స్వర్ణం సాధించగలడని భావించినా.. అంతలోనే ఈ ఘోర ప్రమాదం జరగడంతో క్రీడాలోకం దిగ్ర్భాంతికి లోనైంది.

Updated Date - Feb 13 , 2024 | 05:30 AM