ఒలింపిక్స్‌కు శ్రీశంకర్ దూరం
ABN , Publish Date - Apr 19 , 2024 | 02:15 AM
లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఒలింపిక్ కల చెదిరింది. శిక్షణ సందర్భంగా అత డి మోకాలికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స తప్పనిసరని డాక్టర్లు ధ్రువీకరించారు...
న్యూఢిల్లీ: లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్ ఒలింపిక్ కల చెదిరింది. శిక్షణ సందర్భంగా అత డి మోకాలికి తీవ్ర గాయమైంది. శస్త్రచికిత్స తప్పనిసరని డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో 2024 సీజన్ మొత్తానికి అతడు దూరమైనట్టే. ఆసియా, కామన్వెల్త్ క్రీడల్లో శ్రీశంకర్ రజతాలు సొంతం చేసుకొన్నాడు. గతేడాది జరిగిన ఆసియా అథ్లెటిక్ చాంపియన్‌షి్‌ప్సలో 8.37 మీ. దూకిన మురళీ విశ్వక్రీడలకు అర్హత సాధించాడు. ఈ నెల 27, మే 10న షాంఘై, దోహాలో జరగనున్న డైమండ్ లీగ్‌లకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ గాయమైంది.