Share News

బాధ్యతలు స్వీకరించిన క్రీడామంత్రి మన్సుఖ్‌

ABN , Publish Date - Jun 12 , 2024 | 02:41 AM

కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మన్సుఖ్‌ మాండవ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 52 ఏళ్ల మాండవ్య గుజరాత్‌లోని పోర్‌బందర్‌ స్థానం నుంచి లోక్‌సభకు...

బాధ్యతలు స్వీకరించిన క్రీడామంత్రి మన్సుఖ్‌

న్యూఢిల్లీ: కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా మన్సుఖ్‌ మాండవ్య మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. 52 ఏళ్ల మాండవ్య గుజరాత్‌లోని పోర్‌బందర్‌ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కాగా క్రీడా శాఖ సహాయ మంత్రిగా రక్షా ఖడ్సే కూడా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - Jun 12 , 2024 | 02:41 AM