సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ప్రోక్టర్ ఇక లేరు
ABN , Publish Date - Feb 19 , 2024 | 02:21 AM
దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ మైక్ ప్రోక్టర్ (77) మరణించాడు. డర్బన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. గుండెకు శస్త్రచికిత్స తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో...
జొహాన్నె్‌సబర్గ్: దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్‌రౌండర్ మైక్ ప్రోక్టర్ (77) మరణించాడు. డర్బన్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశాడు. గుండెకు శస్త్రచికిత్స తర్వాత పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిసింది. నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోని పునరాగమనం చేసిన సౌతాఫ్రికా జట్టు తొలి కోచ్‌గా ప్రోక్టర్ వ్యవహరించాడు. తాను ఆడే సమయంలో ఫాస్ట్ బౌలర్, ఆఫ్ స్పిన్నర్, మిడిలార్డర్ బ్యాటర్‌గా భిన్న పాత్రలు పోషించిన మైక్.. రిటైర్మెంట్ తర్వాత కోచ్, సెలెక్టర్, కామెంటేటర్, బోర్డు సభ్యుడిగా, ఎలిట్ ఐసీసీ రెఫరీగా కూడా పనిచేశాడు. తన జీవిత చరమాంకంలో పేద పిల్లలకు కోచింగ్ ఇస్తూ గడిపాడు. వర్ణ వివక్ష కారణంగా సౌతాఫ్రికాపై నిషేధం విధించడంతో.. ప్రోక్టర్ తన కెరీర్‌లో 7 టెస్టులు మాత్రమే ఆడాడు. 2008లో సిడ్నీ టెస్టులో జరిగిన మంకీ గేట్ వ్యవహారంలో భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై మూడు టెస్టుల నిషేధం విధిస్తూ వివాదాస్పద నిర్ణయం తీసుకొన్న మ్యాచ్ రెఫరీ ప్రోక్టరే. అయితే, టీమిండియా నిరసన తర్వాత ఆ నిషేధాన్ని రద్దు చేశారు.