దక్షిణాఫ్రికా లక్ష్యం 148
ABN , Publish Date - Dec 29 , 2024 | 05:29 AM
దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల ఛేదనలో.. శనివారం ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో...

ప్రస్తుతం 27/3 ఫ పాక్‌తో తొలి టెస్టు
సెంచూరియన్: దక్షిణాఫ్రికా-పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా మారింది. పాక్ నిర్దేశించిన 148 పరుగుల ఛేదనలో.. శనివారం ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 27/3 స్కోరు చేసింది. అంతకుముందు ఆటకు మూడో రోజు ఓవర్ స్కోరు 88/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన పాకిస్థాన్ 237 పరుగులకు ఆలౌటైంది. జెన్సన్ (6/52) ఆరు వికెట్లతో ప్రత్యర్థి పనిబట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 211, దక్షిణాఫ్రికా 301 పరుగులు చేశాయి.