Share News

దక్షిణాఫ్రికాకు ఆధిక్యం

ABN , Publish Date - Feb 15 , 2024 | 03:47 AM

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు 31 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు బుధవారం కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే...

దక్షిణాఫ్రికాకు ఆధిక్యం

కివీస్‌ 211 ఆలౌట్‌

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో దక్షిణాఫ్రికాకు 31 పరుగుల ఆధిక్యం దక్కింది. రెండో రోజు బుధవారం కివీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 211 పరుగులకే కుప్పకూలింది. కేన్‌ విలియమ్సన్‌ 43, లాథమ్‌ 40 రన్స్‌ చేశారు. డేన్‌ పీట్‌ 5 వికెట్లతో దెబ్బతీశాడు. ప్యాటర్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. అంతకుముందు సౌతాఫ్రికా తమ ఓవర్‌నైట్‌ స్కోరు (220/6)కు 22 రన్స్‌ మాత్రమే జోడించి 242 వద్ద ఆలౌటైంది. ఒరోర్కెకు 4, రవీంద్రకు 3 వికెట్లు దక్కాయి.

Updated Date - Feb 15 , 2024 | 03:47 AM