డబ్ల్యూటీసీ ఫైనల్లో దక్షిణాఫ్రికా
ABN , Publish Date - Dec 30 , 2024 | 05:11 AM
ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మరో రోజు ఆట మిగిలుండగానే గెలిచిన సఫారీలు.. తొలిసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు...
తొలి టెస్ట్‌లో పాక్‌పై థ్రిల్లింగ్ విక్టరీ
సెంచూరియన్: ఉత్కంఠభరితంగా సాగిన తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 2 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మరో రోజు ఆట మిగిలుండగానే గెలిచిన సఫారీలు.. తొలిసారి వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు దూసుకెళ్లారు. 148 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు నాలుగో రోజైన ఆదివారం ఓవర్‌నైట్ స్కోరు 27/3తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌతాఫ్రికా 8 వికెట్లకు 150 పరుగులు చేసి నెగ్గింది. మహ్మద్ అబ్బాస్ (6/54) దెబ్బకు.. ఆతిథ్య జట్టు 99/8తో ఓటమి అంచున నిల్చుంది. అయితే, మార్కో జెన్సన్ (16 నాటౌట్), రబాడ (31 నాటౌట్) తొమ్మిదో వికెట్‌కు అజేయంగా 51 పరుగుల భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. కెప్టెన్ బవుమా (40), మార్‌క్రమ్ (37) రాణించారు. పాకిస్థాన్ 211, 237 పరుగుల చేయగా.. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 301 రన్స్ సాధించింది. వచ్చే ఏడాది లార్డ్స్‌లో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో ఒక జట్టుగా దక్షిణాఫ్రికా ఖరారు కావడంతో.. రెండో బోర్త్ కోసం ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక మధ్య తీవ్ర పోటీ నెలకొంది.