Share News

దక్షిణాఫ్రికా 80/4

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:24 AM

దక్షిణాఫ్రికా-శ్రీలంక తొలి టెస్ట్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. దీంతో బుధవారం మొదలైన మొదటి టెస్ట్‌లో 20.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది....

దక్షిణాఫ్రికా 80/4

డర్బన్‌: దక్షిణాఫ్రికా-శ్రీలంక తొలి టెస్ట్‌కు వరుణుడు తీవ్ర ఆటంకం కలిగించాడు. దీంతో బుధవారం మొదలైన మొదటి టెస్ట్‌లో 20.4 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 80/4 స్కోరు చేసింది. వర్షంతో మొదటి రోజు ఆట నిలిచే సమయానికి కెప్టెన్‌ బవుమా (28), కైల్‌ వెరియన్నె (9) క్రీజులో ఉన్నారు. మార్‌క్రమ్‌ (9), టోనీ జోర్జి (4), స్టబ్స్‌ (16), డేవిడ్‌ బెడింగమ్‌ (4) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. లహిరు కుమార రెండు వికెట్లు పడగొట్టాడు.

Updated Date - Nov 28 , 2024 | 04:24 AM