Share News

‘ఆమె’గా మారిన సంజయ్‌ బంగర్‌ కుమారుడు

ABN , Publish Date - Nov 12 , 2024 | 01:18 AM

భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కుమారుడు ఆర్యన్‌ లింగమార్పిడి చేయించుకున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్‌ పదకొండు నెలలపాటు హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) కొనసాగించాక...

‘ఆమె’గా మారిన సంజయ్‌ బంగర్‌ కుమారుడు

ముంబై: భారత మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కుమారుడు ఆర్యన్‌ లింగమార్పిడి చేయించుకున్నాడు. 23 ఏళ్ల ఆర్యన్‌ పదకొండు నెలలపాటు హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ (హెచ్‌ఆర్‌టీ) కొనసాగించాక ఇటీవలే అమ్మాయిగా మారాడు. తన పేరును అనయ బంగర్‌గా మార్చుకున్నాడు. ముంబైలోని ఇస్లాం జింఖానా క్లబ్‌ తరఫున క్రికెట్‌ ఆడిన ఆర్యన్‌.. గతంలో ధోనీ, విరాట్‌తో దిగిన ఫొటోలతో పాటు అమ్మాయిగా మారిన క్రమాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Updated Date - Nov 12 , 2024 | 01:18 AM