ఘనమైన బోణీ
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:25 AM
వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులతో విజయం సాధించారు. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది...
తొలి టీ20లో భారత్ గెలుపు
ముంబై : వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో ఆదివారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో 49 పరుగులతో విజయం సాధించారు. మొదట భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. జెమీమా (73), మంధాన (54) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. ఛేదనలో టిటాస్ (3/37) ధాటికి వెస్టిండీస్ 7 వికెట్లకు 146 పరుగులే చేసి ఓడింది. డాటిన్ (52), క్వియానా (49) రాణించారు. స్పిన్నర్లు దీప్తిశర్మ. రాధా యాదవ్ చెరో రెండు వికెట్లు కైవసం చేసుకున్నారు.
సంక్షిప్తస్కోర్లు : భారత్ 20 ఓవర్లలో 195/4 (జెమీమా 73, మంధాన 54, ఉమ 24, రిచా 20, హర్మన్ 13 నాటౌట్, కరిష్మా 2/18); వెస్టిండీస్ 20 ఓవర్లలో 146/7 (డాటిన్ 52, క్వియానా జోసెప్ 49, టిటాస్ సిద్ధూ 3/37, దీప్తిశర్మ 2/21, రాధ 2/28).