Share News

పోలీసు కస్టడీలో స్లేటర్‌

ABN , Publish Date - Apr 16 , 2024 | 02:25 AM

ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్‌, వ్యాఖ్యాత మైకేల్‌ స్లేటర్‌ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదు కావడంతో స్థానిక పోలీసులు రిమాండ్‌కు తరలించారు...

పోలీసు కస్టడీలో స్లేటర్‌

క్వీన్స్‌లాండ్‌: ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్‌, వ్యాఖ్యాత మైకేల్‌ స్లేటర్‌ చిక్కుల్లో పడ్డాడు. అతడిపై ఏకంగా 19 కేసులు నమోదు కావడంతో స్థానిక పోలీసులు రిమాండ్‌కు తరలించారు. గతేడాది డిసెంబరు నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 12 వరకు గృహహింస, మహిళలను వెంబడించడం, భయభ్రాంతులకు గురిచేయడం, భౌతిక దాడికి దిగడం, దొంగతనాలు.. ఇలా పలురకాల కేసులు 54 ఏళ్ల స్లేటర్‌పై నమోదయ్యాయి. దీంతో గత శుక్రవారమే స్లేటర్‌ను అరెస్ట్‌ చేశారు. పలుసార్లు కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బెయిల్‌ నియమాలను కూడా ఉల్లంఘించాడు. 2004లో స్లేటర్‌ క్రికెట్‌ నుంచి తప్పుకొన్నాక కామెంటేటర్‌గా స్థిరపడ్డాడు.

Updated Date - Apr 16 , 2024 | 02:25 AM