Share News

ప్రీక్వార్టర్స్‌కు సింధు, లక్ష్య సేన్‌

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:35 AM

సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీలో పీవీ సింధు, లక్ష్యసేన్‌ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సహచరి అన్‌మోల్‌ కర్బ్‌పై సింధు 21-17, 21-15తో గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో...

ప్రీక్వార్టర్స్‌కు సింధు, లక్ష్య సేన్‌

లఖ్‌నవూ: సయ్యద్‌ మోదీ అంతర్జాతీయ టోర్నీలో పీవీ సింధు, లక్ష్యసేన్‌ ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌లో సహచరి అన్‌మోల్‌ కర్బ్‌పై సింధు 21-17, 21-15తో గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో మాళవిక బన్సోడ్‌ 21-16, 21-7తో డబ్‌జెన్సికా (పోలెండ్‌)పై, అనుపమ ఉపాధ్యాయ్‌ 19-21, 22-20, 21-15తో ఫాతిమాపై, ఐరా శర్మ 21-13, 21-19తో దీప్సిక సింగ్‌పై, ఉన్నతి హుడా 21-12, 21-16తో తమోన్‌వాన్‌ (థాయ్‌)పై గెలిచారు. అయితే, మూడో సీడ్‌ ఆకర్షి కశ్యప్‌ 8-21, 12-21తో ఉ లి యు (చైనా) చేతిలో ఓడింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్‌ 21-12, 21-12తో ఐదిల్‌ (మలేసియా)పై, కిరణ్‌ జార్జ్‌ 21-12, 23-21తో ఆలాప్‌ మిశ్రాపై, ప్రియాంశు రజావత్‌ 21-13, 21-12తో కార్తికేయపై గెలిచారు. డబుల్స్‌లో తనీషా క్రాస్టో-అశ్విని పొన్నప్ప 21-12, 21-10తో ఇషు మాలిక్‌-తనుపై, ప్రియ-శ్రుతి జోడీ 21-14, 21-12తో అలీషా-వర్షిణిపై గెలిచి ముందంజ వేశారు. కాగా, ట్రీసా జాలీ-గాయత్రి జంటకు వాకోవర్‌ లభించింది. సాయి ప్రతీక్‌-పృథ్వీ, ఇషాన్‌-శంకర్‌ ప్రసాద్‌, హరిహరన్‌-రూబెన్‌ జోడీలు కూడా రెండో రౌండ్‌కు చేరుకొన్నాయి.

Updated Date - Nov 28 , 2024 | 04:35 AM