క్వార్టర్స్‌లో సింధు
ABN , Publish Date - Mar 08 , 2024 | 02:21 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏస్ షట్లర్ పీవీ సింధు, గాయత్రి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్ ఓటమితో ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో...
గాయత్రి జోడీ కూడా
శ్రీకాంత్ అవుట్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో ఏస్ షట్లర్ పీవీ సింధు, గాయత్రి జోడీ క్వార్టర్స్‌కు దూసుకెళ్లగా.. కిడాంబి శ్రీకాంత్ ఓటమితో ఇంటిముఖం పట్టాడు. మహిళల సింగిల్స్‌లో గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సింధు 13-21, 21-10, 21-14తో వరల్డ్ నెం:10 బీవెన్ జాంగ్ (అమెరికా) గెలిచింది. తొలి గేమ్‌లో తడబడినా.. ఆ తర్వాత సింధు బలంగా పుంజుకొంది. కాగా, పురుషుల రెండో రౌండ్‌లో శ్రీకాంత్ 21-19, 12-21, 20-22తో లు గువాంగ్ జు (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో ట్రీసా జాలీ-గాయత్రి జంట 21-18, 21-13తో జపాన్ ద్వయం యుకీ ఫుకుషిమా-సయాక హిరోటాపై వరుస గేముల్లో గెలిచింది.