Share News

టైటిల్‌ పోరుకు సింధు

ABN , Publish Date - May 26 , 2024 | 04:35 AM

రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడింటన్‌ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో...

టైటిల్‌ పోరుకు సింధు

మలేసియా మాస్టర్స్‌

కౌలాలంపూర్‌: రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడింటన్‌ టోర్నీ ఫైనల్లో ప్రవేశించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో ఈ భారత స్టార్‌ షట్లర్‌ 13-21, 21-16, 21-12తో బుసానన్‌ ఓంగ్‌బామ్‌రుంగ్‌ఫాన్‌ (థాయ్‌లాండ్‌)పై పోరాడి నెగ్గింది. బుసానాన్‌పై సింధుకిది 18వ విజయం కావడం విశేషం. ఆదివారం జరిగే టైటిల్‌ ఫైట్‌లో వరల్డ్‌ నెం.15 సింధు చైనాకు చెందిన రెండో సీడ్‌ వాంగ్‌ ఝీ యీతో అమీతుమీ తేల్చుకుంటుంది. నిరుడు ఆర్కిటిక్‌ ఓపెన్‌లో వాంగ్‌ చేతిలో సింధు పరాజయం చవిచూసింది. కానీ అంతకుముందు రెండుసార్లు ఆమెతో తలపడినప్పుడు భారత షట్లరే విజయం సాధించింది.

Updated Date - May 26 , 2024 | 04:35 AM