దీపికకు రజతం
ABN , Publish Date - Oct 22 , 2024 | 01:21 AM
వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ ఆర్చరీ ఫైనల్లో రజత పతకం అందుకుంది. అయితే తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర పతకం సాధించడంలో...
ధీరజ్ విఫలంఫ ఆర్చరీ వరల్డ్ కప్ ఫైనల్
న్యూఢిల్లీ: వెటరన్ ఆర్చర్ దీపికా కుమారి మెక్సికోలో జరిగిన వరల్డ్ కప్ ఆర్చరీ ఫైనల్లో రజత పతకం అందుకుంది. అయితే తెలుగు ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర పతకం సాధించడంలో విఫలమయ్యాడు. మూడేళ్ల తర్వాత వరల్డ్ కప్ ఫైనల్ బరిలో దిగిన మూడో సీడ్ దీపిక స్వర్ణ పతక మ్యాచ్‌లో 0-6తో లీ జియామన్ (చైనా) చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. తొమ్మిదోసారి ప్రపంచ కప్‌లో తలపడిన ఆమెకిది ఐదో రజతం. ఇవిగాక దీపిక ఓ కాంస్య పతకమూ నెగ్గింది. పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో విజయవాడ ఆర్చర్, మూడో సీడ్ ధీరజ్ క్వార్టర్ ఫైనల్లో 4-6తో రెండో సీడ్ లీ వూ సోక్ (కొరియా) చేతిలో పరాజయం పాలై పతకం లేకుండానే టోర్నీని ముగించాడు.