Share News

గ్రాండ్‌మాస్టర్‌గా శ్యామ్‌ నిఖిల్‌

ABN , Publish Date - May 14 , 2024 | 05:04 AM

తమిళనాడుకు చెందిన శ్యామ్‌ నిఖిల్‌ భారత 85వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. దుబాయ్‌ పోలీస్‌ మాస్టర్స్‌ ఫైనల్‌ రౌండ్‌లో జిన్షీ బాయ్‌ (చైనా)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్న నిఖిల్‌...

గ్రాండ్‌మాస్టర్‌గా శ్యామ్‌ నిఖిల్‌

దుబాయ్‌: తమిళనాడుకు చెందిన శ్యామ్‌ నిఖిల్‌ భారత 85వ గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. దుబాయ్‌ పోలీస్‌ మాస్టర్స్‌ ఫైనల్‌ రౌండ్‌లో జిన్షీ బాయ్‌ (చైనా)తో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకున్న నిఖిల్‌ తుది జీఎం నార్మ్‌ను సాధించాడు. 2011లో రెండు జీఎం నార్మ్‌లు పొందాక.. తర్వాతి ఏడాది ఫిడే రేటింగ్స్‌ జాబితాలో నిఖిల్‌ తొలిసారి 2502 ఎలో పాయింట్లు పొందాడు. అనంతరం 12 ఏళ్ల తర్వాత గ్రాండ్‌మాస్టర్‌ అయ్యాడు.

నార్వే చెస్‌కు హంపి, ప్రజ్ఞానంద, వైశాలి

ప్రతిష్ఠాత్మక నార్వే చెస్‌ టోర్నమెంట్‌లో భారత్‌ నుంచి కోనేరు హంపి, ప్రజ్ఞానంద, వైశాలి ప్రాతినిథ్యం వహిస్తారు. ‘వింబుల్డన్‌ ఆఫ్‌ చెస్‌’గా భావించే ఈ టోర్నీ ఈనెల 27 నుంచి నార్వేలో జరగనుంది.

Updated Date - May 14 , 2024 | 05:04 AM