Share News

సబలెంకా, రిబకినాకు షాక్‌

ABN , Publish Date - Jun 06 , 2024 | 04:46 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల రెండో సీడ్‌ అర్యానా సబలెంకా, నాలుగో సీడ్‌ ఎలెనా రిబకినాలకు క్వార్టర్‌ఫైనల్లో షాక్‌ తగిలింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో...

సబలెంకా, రిబకినాకు షాక్‌

పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌లో మహిళల రెండో సీడ్‌ అర్యానా సబలెంకా, నాలుగో సీడ్‌ ఎలెనా రిబకినాలకు క్వార్టర్‌ఫైనల్లో షాక్‌ తగిలింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో అన్‌సీడెడ్‌ మిరా ఆండ్రీవా (రష్యా) 6-7 (5), 6-4 6-4తో సబలెంకా (బెలార్‌స)ని చిత్తు చేసింది. మరో క్వార్టర్‌ఫైనల్లో 12వ సీడ్‌ జాస్మిన్‌ పౌలిని (ఇటలీ) 6-2, 4-6, 6-4తో రిబకినా (కజకిస్థాన్‌)ను ఓడించింది. గురువారం జరిగే సెమీ్‌సలో పౌలిని-ఆండ్రీవా అమీతుమీ తేల్చుకుంటారు. పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్‌ఫైనల్లో మూడో సీడ్‌ అల్కారజ్‌ 6-3, 7-6 (3), 6-3తో తొమ్మిదో సీడ్‌ సిట్సిపా్‌సను చిత్తు చేశాడు. సెమీ్‌సలో రెండో సీడ్‌ జానిక్‌ సిన్నర్‌తో అల్కారజ్‌ తలపడనున్నాడు.

సెమీ్‌సలో బోపన్న: భారత ఆటగాడు రోహన్‌ బోపన్న సెమీస్‌ చేరాడు. క్వార్టర్‌ఫైనల్లో రెండో సీడ్‌ బోపన్న/మాథ్యూ ఎడ్బెన్‌ ద్వయం 7-6 (3), 5-7, 6-1తో బెల్జియం జంట శాండెర్‌/జొరాన్‌పై విజయం సాధించింది.

Updated Date - Jun 06 , 2024 | 04:46 AM