Share News

షమి కాలికి సర్జరీ

ABN , Publish Date - Feb 28 , 2024 | 03:40 AM

టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి కాలికి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. కాలి మడమ కండర బంధనానికి నిర్వహించిన...

షమి కాలికి సర్జరీ

ఐపీఎల్‌కు దూరం

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమి కాలికి లండన్‌లోని ఓ ఆసుపత్రిలో సర్జరీ జరిగింది. కాలి మడమ కండర బంధనానికి నిర్వహించిన ఈ సర్జరీ నుంచి కోలుకోవడానికి కనీసం మూడు నెలల సమయం పట్టనుంది. దీంతో రాబోయే ఐపీఎల్‌కు అతడు పూర్తిగా దూరం కానున్నాడు. ఆ తర్వాత జూన్‌లో అమెరికాలో జరిగే టీ20 వరల్డ్‌క్‌పనకు కూడా అనుమానమే. గతేడాది వన్డే వరల్డ్‌క్‌పలో ఆస్ట్రేలియాతో ఫైనల్‌ తర్వాత.. గాయం కారణంగా షమి మళ్లీ బరిలోకి దిగలేదు. కాగా షమి త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.

Updated Date - Feb 28 , 2024 | 03:40 AM