Share News

అంతర్జాతీయ క్రికెట్‌కు షాబాజ్‌ నదీమ్‌ గుడ్‌బై

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:01 AM

టీమిండియా ఆటగాడు, జార్ఖండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ అంతర్జాతీయ స్థాయితో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కూ గుడ్‌బై చెప్పేశాడు...

అంతర్జాతీయ క్రికెట్‌కు షాబాజ్‌ నదీమ్‌ గుడ్‌బై

న్యూఢిల్లీ: టీమిండియా ఆటగాడు, జార్ఖండ్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్‌ నదీమ్‌ అంతర్జాతీయ స్థాయితో పాటు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కూ గుడ్‌బై చెప్పేశాడు. జాతీయ జట్టుకు ఆడేందుకు తనకు అన్ని దారులు మూసుకుపోయాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు 34 ఏళ్ల నదీమ్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా జరిగే టీ20 లీగ్‌లలో ఆడేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలిపాడు. 2019-2021 మధ్య టీమిండియా తరఫున రెండు టెస్టులు ఆడిన నదీమ్‌.. 8 వికెట్లు పడగొట్టాడు. రెండు దశాబ్దాల తన కెరీర్‌లో 140 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడి 542 వికెట్లు తీశాడు.

Updated Date - Mar 06 , 2024 | 06:01 AM