Share News

T20 Scotland vs Oman : స్కాట్లాండ్‌ అలవోకగా..

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:53 AM

బ్రాండన్‌ మెక్‌ములెన్‌ (31 బంతుల్లో 61 నాటౌట్‌) ధనాధన్‌ అర్ధ శతకంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో స్కాట్లాండ్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-బిలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్లతో ఒమన్‌ను చిత్తు

T20 Scotland vs Oman : స్కాట్లాండ్‌ అలవోకగా..

7 వికెట్లతో ఒమన్‌ చిత్తు

నార్త్‌ సౌండ్‌: బ్రాండన్‌ మెక్‌ములెన్‌ (31 బంతుల్లో 61 నాటౌట్‌) ధనాధన్‌ అర్ధ శతకంతో.. టీ20 వరల్డ్‌క్‌పలో స్కాట్లాండ్‌ రెండో విజయాన్ని నమోదు చేసింది. గ్రూప్‌-బిలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ 7 వికెట్లతో ఒమన్‌ను చిత్తు చేసింది. తొలుత ఒమన్‌ 20 ఓవర్లలో 150/7 స్కోరు చేసింది. ప్రతీక్‌ అథ్వాలే (54), అయాన్‌ ఖాన్‌ (41 నాటౌట్‌) బ్యాట్‌తో అదరగొట్టారు. షరీఫ్‌ 2 వికెట్లు తీశాడు. ఛేదనలో స్కాట్లాండ్‌ 13.1 ఓవర్లలో 153/3 స్కోరు చేసి గెలిచింది. ఓపెనర్‌ జార్జ్‌ మున్సే (41), బ్రాండన్‌ రెండో వికెట్‌కు 29 బంతుల్లో 65 పరుగులు జోడించారు.

ఇంగ్లండ్‌కు ఇరకాటం: స్కాట్లాండ్‌ విజయంతో.. గ్రూప్‌-బిలో డిఫెండింగ్‌ చాంప్‌ ఇంగ్లండ్‌ పరిస్థితి ఇరకాటంలో పడింది. వర్షం కారణంగా స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ రద్దు కాగా.. ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఈ నేపథ్యంలో సూపర్‌-8కు చేరాలంటే.. మిగిలిన రెండు మ్యాచ్‌లో బట్లర్‌ సేన తప్పకుండా నెగ్గడంతోపాటు రన్‌రేట్‌ను కూడా భారీగా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.

సంక్షిప్త స్కోర్లు

ఒమన్‌: 20 ఓవర్లలో 150/7 (ప్రతీక్‌ 54, అయాన్‌ 41 నాటౌట్‌; షరీఫ్‌ 2/40).

స్కాట్లాండ్‌: 13.1 ఓవర్లలో 153/3 (మెక్‌ములెన్‌ 61, మున్సే 41 నాటౌట్‌; బిలాల్‌ 1/12, ఆకిబ్‌ 1/41).

Updated Date - Jun 11 , 2024 | 04:53 AM