Share News

సాత్విక్‌ జోడీ శుభారంభం

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:07 AM

తెలుగు షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, గాయత్రి గోపీచంద్‌ జోడీలు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాయి. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ద్వయం...

సాత్విక్‌ జోడీ శుభారంభం

పారిస్‌: తెలుగు షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌, గాయత్రి గోపీచంద్‌ జోడీలు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాయి. మంగళవారం జరిగిన తొలి రౌండ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ ద్వయం సాత్విక్‌-చిరాగ్‌ షెట్టి 21-13, 24-22తో ఓంగ్‌ యూ -టెయో (మలేసియా) జోడీపై నెగ్గి, రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రిసా జాలీ జోడీ 16-21, 21-19, 21-17తో సహచర షట్లర్లు అశ్వినీ పొన్నప్ప-తనీషా క్యాస్ట్రో ద్వయంపై గెలిచింది. లక్ష్యసేన్‌ 15-21, 21-15, 21-3తో సునేయమ (జపాన్‌)పై నెగ్గి ముందంజ వేయగా, ప్రియాన్షు రజావత్‌ 8-21, 15-21తో డెన్మార్క్‌ దిగ్గజం విక్టర్‌ ఆక్సెల్‌సెన్‌ చేతిలో ఓడిలో టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ఇక, బుధవారం జరగనున్న సింగిల్స్‌ తొలి రౌండ్‌లో పీవీ సింధు బరిలోకి దిగనుంది.

Updated Date - Mar 06 , 2024 | 06:33 AM