Share News

సరీన్‌ ఓ చీటర్‌!

ABN , Publish Date - May 07 , 2024 | 02:12 AM

ఆన్‌లైన్‌ పోటీల్లో భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌, 19 ఏళ్ల నిహాల్‌ సరీన్‌ మోసానికి పాల్పడుతున్నాడంటూ మాజీ వరల్డ్‌ చాంపియన్‌ వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ (రష్యా) ఎక్స్‌లో...

సరీన్‌ ఓ చీటర్‌!

భారత యువ జీఎంపై క్రామ్నిక్‌ ఆరోపణ

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ పోటీల్లో భారత యువ గ్రాండ్‌ మాస్టర్‌, 19 ఏళ్ల నిహాల్‌ సరీన్‌ మోసానికి పాల్పడుతున్నాడంటూ మాజీ వరల్డ్‌ చాంపియన్‌ వ్లాదిమిర్‌ క్రామ్నిక్‌ (రష్యా) ఎక్స్‌లో సంచలన ఆరోపణలు చేశాడు. అయితే, అతడు ఇలాంటి నిందలు వేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో అమెరికా జీఎం నకమురా కూడా గేమ్‌లో మోసం చేస్తున్నాడంటూ గందరగోళం సృష్టించాడు. కాగా, క్రామ్నిక్‌ ఆరోపణల నేపథ్యంలో చెస్‌ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌గా కూడా పనిచేస్తున్న ‘చెస్‌.కామ్‌’ అతడి బ్లాగ్‌ను నిలిపేసింది. టాప్‌-10 ప్లేయర్లపై సరీన్‌ విజయాలు 99.99 శాతం అసాధ్యమనేది క్రామ్నిక్‌ వాదన. ఈ నేపథ్యంలో సరీన్‌తో ముఖాముఖిగా తలపడాలని అతడి మేనేజర్‌ సవాల్‌ విసిరాడు.

Updated Date - May 07 , 2024 | 02:12 AM