Share News

‘పికిల్‌బాల్‌’లో సమంత

ABN , Publish Date - Aug 21 , 2024 | 05:53 AM

వరల్డ్‌ పికిల్‌బాల్‌ లీగ్‌ (డబ్ల్యూపీబీఎల్‌)లో పోటీ పడే చెన్నై జట్టును టాలీవుడ్‌ నటి సమంత దక్కించుకుంది. సోమవారం ముంబైలో జరిగిన వేలంలో సమంత చెన్నై జట్టును...

‘పికిల్‌బాల్‌’లో సమంత

చెన్నై జట్టును దక్కించుకున్న నటి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): వరల్డ్‌ పికిల్‌బాల్‌ లీగ్‌ (డబ్ల్యూపీబీఎల్‌)లో పోటీ పడే చెన్నై జట్టును టాలీవుడ్‌ నటి సమంత దక్కించుకుంది. సోమవారం ముంబైలో జరిగిన వేలంలో సమంత చెన్నై జట్టును సొంతం చేసుకున్నట్టు డబ్ల్యూపీబీఎల్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. పికిల్‌బాల్‌ ఆటను చూసిన తొలిసారే దాంతో ప్రేమలో పడ్డానని చెప్పింది. ‘దేశీయ క్రీడారంగంలో ఎక్కువ మంది మహిళలను భాగం చేయాలనేది నా లక్ష్యం. ఇందుకోసం డబ్ల్యూపీబీఎల్‌తో కలిసి పనిచేస్తా’ అని సమంత తెలిపింది.

Updated Date - Aug 21 , 2024 | 05:53 AM