Share News

సలీమాకు పగ్గాలు మహిళల హాకీ జట్టు ఎంపిక

ABN , Publish Date - May 03 , 2024 | 02:50 AM

వెటరన్‌ గోల్‌కీపర్‌ సవితా పూనియాపై వేటు పడింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ఆమెను తొలగించి..మిడ్‌ఫీల్డర్‌ సలీమా టేటేకు బాధ్యతలు అప్పగించారు...

సలీమాకు పగ్గాలు మహిళల హాకీ జట్టు ఎంపిక

న్యూఢిల్లీ : వెటరన్‌ గోల్‌కీపర్‌ సవితా పూనియాపై వేటు పడింది. భారత మహిళల హాకీ జట్టు కెప్టెన్‌గా ఆమెను తొలగించి..మిడ్‌ఫీల్డర్‌ సలీమా టేటేకు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు..బెల్జియం, ఇంగ్లండ్‌ అంచె ప్రొ.హాకీ లీగ్‌లో తలపడే 24 మంది సభ్యుల భారత జట్టును గురువారం ప్రకటించారు. సవిత సారథ్యంలో జట్టు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. అలాగే స్వదేశంలో జరిగిన ప్రొ.లీగ్‌ హాకీ మ్యాచ్‌ల్లోనూ సత్తా చాటలేకపోయింది. తెలుగమ్మాయి ఈదుల జ్యోతి (ఫార్వార్డ్‌) జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

Updated Date - May 03 , 2024 | 02:50 AM