‘ఆరే’సిన సాజిద్
ABN , Publish Date - Oct 25 , 2024 | 01:47 AM
ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/128) మరోసారి చెలరేగి ఆరు వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్‌తో గురువారం మొదలైన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 267 పరుగులకే...

ఇంగ్లండ్ 267 ఆలౌట్
రావల్పిండి: ఆఫ్ స్పిన్నర్ సాజిద్ ఖాన్ (6/128) మరోసారి చెలరేగి ఆరు వికెట్లు పడగొట్టడంతో పాకిస్థాన్‌తో గురువారం మొదలైన మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 267 పరుగులకే ఆలౌటైంది. సాజిద్, మరో స్పిన్నర్ నోమన్ ధాటికి పర్యాటక జట్టు ఓ దశలో 118/6 స్కోరుతో కష్టాల్లో పడింది. అయితే కీపర్ జేమీ స్మిత్ (89), అట్కిన్సన్ (39) ఏడో వికెట్‌కు 105 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ కోలుకుంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన పాకిస్థాన్ తొలి రోజు ఆఖరికి 73/3 స్కోరుతో నిలిచింది. కాగా పాకిస్థాన్ జట్టు తమ పేసర్ ఆమెర్ జమాల్‌తో ఒక్క ఓవర్‌కూడా బౌలింగ్ చేయించలేదు. ఓ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో పేస్ బౌలర్‌తో బౌలింగ్ వేయించకపోవడం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. మొదటిసారి 1882లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఇలాగే చేసింది.