Share News

రూ. 2.70 కోట్ల పందెం కాశాడు

ABN , Publish Date - May 26 , 2024 | 04:38 AM

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఐపీఎల్‌ ఫైనల్‌ మేనియా ఆవరించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఆదివారం చెన్నైలో జరిగే టైటిల్‌ ఫైట్‌పై ఇప్పటికే బెట్టింగ్‌లు...

రూ. 2.70 కోట్ల పందెం కాశాడు

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ను ఐపీఎల్‌ ఫైనల్‌ మేనియా ఆవరించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్ల మధ్య ఆదివారం చెన్నైలో జరిగే టైటిల్‌ ఫైట్‌పై ఇప్పటికే బెట్టింగ్‌లు మొదలయ్యాయి. తాజాగా..కెనడా ర్యాపర్‌, సింగర్‌ డ్రేక్‌కూడా ఆ జాబితాలో చేరాడు. ఈ విషయాన్ని అతడు ‘ఎక్స్‌’ వేదికగా స్వయంగా వెల్లడించాడు. కేకేఆర్‌పై రూ. 2.70 కోట్లకు పందెం కాసినట్టు తెలిపాడు. నైట్‌రైడర్స్‌ కనుక విజేతగా నిలిస్తే డ్రేక్‌కూ రూ. 3.50 కోట్లు లభిస్తాయి.

Updated Date - May 26 , 2024 | 04:38 AM