రూ. 1.35 లక్షల కోట్లు
ABN , Publish Date - Jun 13 , 2024 | 04:08 AM
గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ వ్యాపార విలువ ఈ సంవత్సరం 6.5 శాతం పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరినట్టు అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ హూలహాన్ లోకీ ఇంక్ వెల్లడించింది...
ఐపీఎల్ విలువ ఇదీ
న్యూఢిల్లీ: గతేడాదితో పోలిస్తే ఐపీఎల్ వ్యాపార విలువ ఈ సంవత్సరం 6.5 శాతం పెరిగి రూ. 1.35 లక్షల కోట్లకు చేరినట్టు అమెరికాకు చెందిన గ్లోబల్ ఇన్వె్‌స్టమెంట్ బ్యాంక్ హూలహాన్ లోకీ ఇంక్ వెల్లడించింది. ఇక..నిరుటితో పోలిస్తే ఐపీఎల్ బ్రాండ్ వాల్యూ స్టాండ్ ఎలోన్ ప్రాతిపదికన 6.3 శాతం పెరిగి రూ. 28 వేల కోట్లకు చేరింది. ఈసారి టోర్నీలో నాకౌట్‌కు చేరకపోయినా..చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే) అటు బ్రాండ్, ఇటు వ్యాపార విలువలో నెం.1 ఫ్రాంచైజీగా నిలిచింది. గత ఏడాది కంటే..ఈసారి ఆ జట్టు విలువ 9శాతం పెరిగి రూ. 1928 కోట్లకు చేరింది. బెంగళూరు రెండో (రూ. 1894 కోట్లు) స్థానంలో నిలిచింది. ఈ సీజన్ విజేత కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్రాండ్ వాల్యూలో (రూ. 1802 కోట్లు) ముంబై ఇండియన్స్ (రూ. 1702 కోట్లు)ను వెనక్కు నెట్టి మూడో స్థానం దక్కించుకుంది. రాజస్థాన్ రాయల్స్ (రూ.1110) ఐదో స్థానం, సన్‌రైజర్స్ (రూ.1101) ఆరో స్థానంలో నిలిచాయి.