Share News

అమెరికాకు రోహిత్‌ బృందం

ABN , Publish Date - May 26 , 2024 | 04:25 AM

టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టులో కొందరు ఆటగాళ్లు అమెరికాకు పయనమయ్యారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పంత్‌, బుమ్రా, సూర్యకుమార్‌, జడేజా...

అమెరికాకు రోహిత్‌ బృందం

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టులో కొందరు ఆటగాళ్లు అమెరికాకు పయనమయ్యారు. మొదటి బ్యాచ్‌లో భాగంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, పంత్‌, బుమ్రా, సూర్యకుమార్‌, జడేజా, శివమ్‌ దూబే, సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌, అక్షర్‌ పటేల్‌తో పాటు చీఫ్‌ కోచ్‌ ద్రవిడ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ శనివారం ముంబై నుంచి న్యూయార్క్‌కు బయలుదేరారు. విరాట్‌ కోహ్లీతో పాటు ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్‌ చేరిన జట్లలోని కొందరు భారత ఆటగాళ్లు ఇంకా వెళ్లాల్సి ఉంది. అమెరికా, వెస్టిండీస్‌ సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ వచ్చేనెల 2న మొదలవనుంది. కాగా, భారత్‌ తన ఆరంభ మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో వచ్చేనెల 5న న్యూయార్క్‌లో ఆడనుంది. అంతకంటే ముందు 1వ తేదీన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాల్గొంటుంది.

Updated Date - May 26 , 2024 | 04:25 AM