రోహిత్@2
ABN , Publish Date - Aug 15 , 2024 | 01:22 AM
శ్రీలంకతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ వన్డేల్లో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంక్‌ల జాబితాలో ఒక మెట్టెక్కిన రోహిత్ రెండో స్థానంలో నిలవగా..
దుబాయ్: శ్రీలంకతో సిరీస్‌లో అదరగొట్టిన రోహిత్ శర్మ వన్డేల్లో రెండో ర్యాంక్‌ను సొంతం చేసుకొన్నాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంక్‌ల జాబితాలో ఒక మెట్టెక్కిన రోహిత్ రెండో స్థానంలో నిలవగా.. శుభ్‌మన్ గిల్ మూడో ర్యాంక్‌కు పడిపోయాడు. పాక్ బ్యాటర్ బాబర్ ఆజమ్ టాప్‌లో ఉన్నాడు. బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగో ర్యాంక్‌లో కొనసాగుతుండగా.. బుమ్రా తొమ్మిదో స్థానంతో నిలకడగా ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో జడేజా 16వ ర్యాంక్‌లో ఉండగా.. హార్దిక్ పాండ్యా 26వ ర్యాంక్‌కు పడిపోయాడు.