Share News

IPL 2024: రింకూ సింగ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఎమోషనల్ అయిన నయా ఫినిషర్!

ABN , Publish Date - Mar 30 , 2024 | 07:11 PM

ఐపీఎల్-2024లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

IPL 2024: రింకూ సింగ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్ కోహ్లీ.. ఎమోషనల్ అయిన నయా ఫినిషర్!

ఐపీఎల్-2024 (IPL 2024)లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో శుక్ర‌వారం కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ (KKR) తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు (RCB) పరాజయం పాలైన సంగతి తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) 83 ప‌రుగుల‌తో రాణించినప్పటికీ ఫ‌లితం లేకుండా పోయింది. మ్యాచ్ ముగిసిన త‌ర్వాత కింగ్ కోహ్లీ కేకేఆర్ ఆట‌గాళ్ల‌ను క‌లిశాడు. యువ‌ ఆట‌గాళ్ల‌కు కీల‌క సూచ‌న‌లు చేశాడు (KKR Vs RCB).

కోల్‌కతా జట్టులోని జ‌ట్టులోని రింకూ సింగ్‌ (Rinku Singh)తో పాటు ప‌లువురు యువ‌ ఆట‌గాళ్ల‌తో మాట్లాడాడు. తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్‌ను రింకూ సింగ్‌కు బహుమతిగా ఇచ్చాడు. కోహ్లీతో దిగిన ఫొటోల‌ను రింకూ సింగ్ త‌న ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. త‌న‌కు కీల‌క సూచ‌న‌లు చేయ‌డంతో పాటు స్పెష‌ల్ బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చినందుకు కోహ్లీకి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశాడు. ఈ వీడియోను ఆర్సీబీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

గతేడాది ఐపీఎల్‌లో చివరి ఓవర్లో వరుస సిక్స్‌లు కొట్టి కేకేఆర్ జట్టును గెలిపించిన రింకూ సింగ్ ఆ తర్వాత భారత జట్టులోకి వచ్చాడు. టీమిండియాకు బెస్ట్ ఫినిషర్‌గా నిలిచాడు. తన అసమాన ఆటతీరుతో పలు మ్యాచ్‌లను గెలిపించాడు. రింకూ సింగ్‌ను అభినందించడమే కాకుండా ప్రత్యేక బహుమతిని అందించిన కోహ్లీపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కోహ్లీది గొప్ప మనసు అని కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - Mar 30 , 2024 | 07:11 PM