Share News

రికీ అజేయ శతకం

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:03 AM

రికీ భుయ్‌ (107 బ్యాటింగ్‌) శతకంతో.. గ్రూప్‌-బిలో బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు దీటుగా బదులిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర మూడో రోజు...

రికీ అజేయ శతకం

  • ఆంధ్ర 339/6

  • బెంగాల్‌తో రంజీ

విశాఖ: రికీ భుయ్‌ (107 బ్యాటింగ్‌) శతకంతో.. గ్రూప్‌-బిలో బెంగాల్‌తో రంజీ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు దీటుగా బదులిస్తోంది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర మూడో రోజు ఆఖరుకు 6 వికెట్లకు 339 పరుగులు చేసింది. రికీతోపాటు షోయబ్‌ (31) క్రీజులో ఉన్నాడు. కెప్టెన్‌ హనుమ విహారి (51) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఆకాష్‌ దీప్‌, మహ్మద్‌ కైఫ్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. బెంగాల్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోరు 409కు ఆంధ్ర ఇంకా 70 పరుగులు వెనుకంజలో ఉంది. మరో రోజు ఆట మాత్రమే మిగిలున్న నేపథ్యంలో ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Updated Date - Jan 08 , 2024 | 01:03 AM