Share News

Ravichandran Ashwin: వందో టెస్ట్‌లో అశ్విన్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో రెండో ఆటగాడిగా..

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:29 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడుతున్న టెస్ట్ అశ్విన్‌కు వందో మ్యాచ్.

Ravichandran Ashwin: వందో టెస్ట్‌లో అశ్విన్ చెత్త రికార్డు.. భారత క్రికెట్ చరిత్రలో రెండో ఆటగాడిగా..

టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తన కెరీర్‌లో మరో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ప్రస్తుతం ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడుతున్న టెస్ట్ (India vs England) అశ్విన్‌కు వందో మ్యాచ్. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. తన కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన టెస్ట్ మ్యాచ్‌లో అశ్విన్ డకౌటై (Ashwin Duck-out) వెనుదిరిగాడు. తద్వారా 100వ టెస్ట్‌లో డకౌట్ అయిన రెండో భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.

ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్ను విరిచిన అశ్విన్.. బ్యాటింగ్‌లో మాత్రం నిరాశపరిచాడు. ఒక్క పరుగూ చేయకుండానే వెనుదిరిగాడు. దీంతో దిలీప్ వెంగ్‌సర్కార్ (1988) తర్వాత వందో టెస్ట్ మ్యాచ్‌లో డకౌట్ అయిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో అలా అవుటైన తొమ్మిదో ఆటగాడిగా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. కాగా, ప్రస్తుత టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా పటిష్టమైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగులు చేసి 255 పరుగులు ఆధిక్యం సంపాదించింది. క్రీజులో కుల్దీప్ (27 నాటౌట్), జస్ప్రీత్ బుమ్రా (19 నాటౌట్) ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 09:29 PM