హైదరాబాద్ 292 ఆలౌట్
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:23 AM
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఉత్తరాఖండ్ పైచేయి సాధించింది. ఆదివారం ఆట ముగిసేసరికి ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (57), కునాల్
ఉత్తరాఖండ్‌తో రంజీ
డెహ్రాడూన్: హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్ మూడో రోజు ఆటలో ఉత్తరాఖండ్ పైచేయి సాధించింది. ఆదివారం ఆట ముగిసేసరికి ఉత్తరాఖండ్ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 189 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (57), కునాల్ చండేలా (57 నాటౌట్) రాణించారు. రోహిత్ 2, అనికేత్, మిలింద్, కార్తికేయ తలో వికెట్ తీశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 244/5తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్ 292కు ఆలౌటైంది. వికెట్‌కీపర్ రాహుల్ రాధేష్ (94) రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 325 పరుగులకు ఆలౌటైంది.