జమ్కేకు రజావత్ షాక్
ABN , Publish Date - Jul 05 , 2024 | 06:07 AM
భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి రాస్మస్ జెమ్కేకు షాకిచ్చాడు....

కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్
కాల్గరీ (కెనడా) : భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్ సంచలనం సృష్టించాడు. కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో తనకంటే ఎంతో మెరుగైన ప్రత్యర్థి రాస్మస్ జెమ్కేకు షాకిచ్చాడు. బుధవారం రాత్రి జరిగిన సింగిల్స్ తొలి రౌండ్‌లో వరల్డ్ నెం. 39 రజావత్ 17-21, 21-16, 21-14తో ఎనిమిదో సీడ్ జెమ్కే (డెన్మార్క్)ను చిత్తు చేశాడు. ఇతర మొదటి రౌండ్ మ్యాచ్‌ల్లో ఆయుష్ షెట్టి 14-21, 11-21తో వతనాబె (జపాన్) చేతిలో, ముత్తుస్వామి 16-21, 17-21తో లానీర్ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం చవిచూశారు. మహిళల సింగిల్స్‌లో అనుపమా ఉపాఽధ్యాయ 21-11, 21-11తో రాచెల్ డరాగ్ (ఐర్లాండ్)పై నెగ్గి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.