Share News

రాయల్స్‌కు వరుణుడి షాక్‌

ABN , Publish Date - May 20 , 2024 | 04:06 AM

ఐపీఎల్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షార్పణమైంది. దీంతో రెండో స్థానంపై ఆశలు పెట్టుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆలస్యంగా టాస్‌ వేసినా..

రాయల్స్‌కు వరుణుడి షాక్‌

కోల్‌కతాతో మ్యాచ్‌ రద్దు

టాప్‌-2లో చాన్స్‌ మిస్‌

ఆర్‌సీబీతో ఎలిమినేటర్‌కు సిద్ధం

గువాహటి: ఐపీఎల్‌లో చివరి లీగ్‌ మ్యాచ్‌ వర్షార్పణమైంది. దీంతో రెండో స్థానంపై ఆశలు పెట్టుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌కు నిరాశే ఎదురైంది. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆలస్యంగా టాస్‌ వేసినా.. ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఇతర జట్లకన్నా చాలా ముందుగానే 16 పాయింట్లు ఖాతాలో వేసుకున్న శాంసన్‌ సేన ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడి టాప్‌-2 స్థానం గల్లంతు చేసుకుంది. తాజా మ్యాచ్‌లోనైనా విజయం సాధిస్తే ఆ అవకాశం ఉన్నప్పటికీ వరుణుడు కరుణించలేదు. దీంతో ఒక పాయింట్‌తోనే సరిపెట్టుకుంది. అలాగే మొత్తం 17 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి ఎలిమినేటర్‌లో ఆర్‌సీబీతో ఆడేందుకు సిద్ధమైంది.


ఇక ఆదివారం రాత్రి ఏడు గంటలకు చిరుజల్లులతో ఆరంభమైన వర్షం కుండపోతగా మారింది. దీంతో ఆటగాళ్లంతా డ్రెస్సిం గ్‌ రూమ్‌కే పరిమితమయ్యారు. అటు మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. రాత్రి 8.30కి కాస్త తగ్గినా కాసేపటికే తిరిగి కొనసాగింది. చివరకు రాత్రి 10 గంటలకు పూర్తిగా ఆగిపోవడంతో కవర్లను తొలగించారు. పిచ్‌ను పరిశీలించిన అంపైర్లు మ్యాచ్‌ను ఏడు ఓవర్లకు కుదించి రాత్రి 10.30కి టాస్‌ కూడా వేశారు. అటు కోల్‌కతా ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఆ వెంటనే తిరిగి భారీ వర్షం కురవడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహం చెందారు. ఐదు ఓవర్ల మ్యాచ్‌ కూడా వీలు కాకపోవడంతో చేసేదేమీ లేక అంపైర్లు సైతం మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్‌ను కేటాయించారు.

పాయింట్ల పట్టిక

జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే

కోల్‌కతా 14 9 3 2 20 1.428

హైదరాబాద్‌ 14 8 5 1 17 0.414

రాజస్థాన్‌ 14 8 5 1 17 0.273

బెంగళూరు 14 7 7 0 14 0.459

చెన్నై 14 7 7 0 14 0.392

ఢిల్లీ 14 7 7 0 14 -0.377

లఖ్‌నవూ 14 7 7 0 14 -0.667

గుజరాత్‌ 14 5 7 2 12 -1.063

పంజాబ్‌ 14 5 9 0 10 -0.353

ముంబై 14 4 10 0 8 -0.318

Updated Date - May 20 , 2024 | 04:06 AM