Share News

పుజార డబుల్‌

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:05 AM

చటేశ్వర్‌ పుజార (243 నాటౌట్‌) ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 17వ డబుల్‌ సెంచరీతో మెరవడంతో.. గ్రూప్‌-ఎలో జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పట్టుబిగించింది...

పుజార డబుల్‌

  • సౌరాష్ట్ర 578/4 డిక్లేర్డ్‌

  • జార్ఖండ్‌తో రంజీ

రాజ్‌కోట్‌: చటేశ్వర్‌ పుజార (243 నాటౌట్‌) ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో 17వ డబుల్‌ సెంచరీతో మెరవడంతో.. గ్రూప్‌-ఎలో జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో సౌరాష్ట్ర పట్టుబిగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 406/4తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన సౌరాష్ట్ర 578/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. ప్రేరక్‌ మన్కడ్‌ (104 నాటౌట్‌) శతకం సాధించాడు. అనంతరం జార్ఖండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 140/2 స్కోరు చేసింది. కుమార్‌ దియోబ్రత్‌ (74), సురాజ్‌ (19) క్రీజులో ఉన్నారు. సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు 296 పరుగులు వెనుకబడింది. మొదటి ఇన్నింగ్స్‌లో జార్ఖండ్‌ 142 పరుగులకు ఆలౌటైంది.

Updated Date - Jan 08 , 2024 | 01:05 AM