అక్టోబరు 18 నుంచి ప్రొ.కబడ్డీ లీగ్
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:10 AM
ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభానికి హైదరాబాద్ వేదిక కానుంది. సోమవా రం పీకేఎల్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మ్యాచ్‌లను మూడు నగరాల్లో నిర్వహించనున్నారు...
హైదరాబాద్‌లో ఆరంభం
న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్ ఆరంభానికి హైదరాబాద్ వేదిక కానుంది. సోమవా రం పీకేఎల్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. మ్యాచ్‌లను మూడు నగరాల్లో నిర్వహించనున్నారు. దీంట్లో భాగంగా తొలి అంచె పోటీలు అక్టోబరు 18నుంచి నవంబరు 9 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుపనున్నారు. ఆరంభ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్-బెంగళూరు బుల్స్ తలపడతాయి. ఆ వెంటనే రెండో మ్యాచ్ యు ముంబా-దబాంగ్ ఢిల్లీ కేసీ మధ్య జరుగుతుంది. ఇక నొయిడాలో నవంబరు 10-డిసెంబరు1 వరకు రెండో అంచె పోటీలు.. పుణెలో డిసెంబరు 3-24 మధ్య మూడో అంచె పోటీలను నిర్వహించనున్నారు. ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తారు.