Share News

హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ ప్లేఆఫ్స్‌ రేపటి నుంచి

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:12 AM

ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌ 10 ప్లేఆ్‌ఫ్సకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సోమవారం నుంచి ప్లేఆఫ్స్‌ పోటీలు జరగనున్నాయి. శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో

హైదరాబాద్‌లో ప్రొ కబడ్డీ ప్లేఆఫ్స్‌ రేపటి నుంచి

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) సీజన్‌ 10 ప్లేఆ్‌ఫ్సకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో సోమవారం నుంచి ప్లేఆఫ్స్‌ పోటీలు జరగనున్నాయి. శనివారం నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్లేఆఫ్స్‌ చేరిన ఆరు జట్ల కెప్టెన్లు ట్రోఫీతో ఫోజులిచ్చారు. సోమవారం జరిగే తొలి ఎలిమినేటర్‌లో దబాంగ్‌ ఢిల్లీతో పట్నా పైరేట్స్‌, రెండో ఎలిమినేటర్‌లో గుజరాత్‌ జెయింట్స్‌తో హరియాణా స్టీలర్స్‌ తలపడనున్నాయి. ఈనెల 28న సెమీఫైనల్స్‌, మార్చి 1న ఫైనల్‌ జరగనుంది.

Updated Date - Feb 25 , 2024 | 05:12 AM