PKL : ఉత్కంఠ పోరులో జైపూర్ గెలుపు
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:28 AM
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39-34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11లో జైపూర్ పింక్ పాంథర్స్ శుభారంభం చేసింది. ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ 39-34తో బెంగాల్ వారియర్స్‌ను ఓడించింది. జైపూర్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగడంతో ఆ జట్టు విజయాన్ని అందుకుంది. కాగా, మరో మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 36-32తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.