Share News

60 గంటలపాటు ఏకధాటిగా ఆడి..

ABN , Publish Date - Apr 21 , 2024 | 03:51 AM

మారథాన్‌ చెస్‌ ఆడిన నైజీరియా చెస్‌ చాంపియన్‌ టుండే అనాకొయా సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పాడు. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌ వద్ద టుండే ఏకధాటిగా 60 గంటపాటు చెస్‌ ఆడాడు...

60 గంటలపాటు ఏకధాటిగా ఆడి..

చెస్‌లో నైజీరియా ఆటగాడు టుండే రికార్డు ఫీట్‌

న్యూయార్క్‌: మారథాన్‌ చెస్‌ ఆడిన నైజీరియా చెస్‌ చాంపియన్‌ టుండే అనాకొయా సరికొత్త గిన్నిస్‌ రికార్డును నెలకొల్పాడు. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌ వద్ద టుండే ఏకధాటిగా 60 గంటపాటు చెస్‌ ఆడాడు. అతడికి ప్రత్యర్థిగా అమెరికా చెస్‌ చాంపియన్‌ షాన్‌ మార్టినెజ్‌ వ్యవహరించాడు. ఈ క్రమంలో 2018లో నార్వే ప్లేయర్లు హల్వర్డ్‌ హగ్‌ ఫ్లాటిబో-సుజుర్‌ ఫెర్కింగ్‌స్టాడ్‌ 56 గంటల 9 నిమిషాల 37 సెకన్ల రికార్డు బద్దలైంది. అయితే, ఈ ఫీట్‌ గురించి గిన్ని్‌సబుక్‌ అధికారులు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆఫ్రికా చిన్నారుల విద్యకు విరాళాలు సేకరించడం కోసం టుంటే రికార్డు ఫీట్‌కు ఉపక్రమించాడు.

Updated Date - Apr 21 , 2024 | 03:51 AM