Share News

అమన్‌కు పారిస్‌ బెర్త్‌

ABN , Publish Date - May 12 , 2024 | 01:56 AM

స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా పారిస్‌ ఒలింపిక్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో ఓడి...

అమన్‌కు పారిస్‌ బెర్త్‌

పూనియా అవుట్‌

ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ రెజ్లింగ్‌ టోర్నీ

ఇస్తాంబుల్‌ (టర్కీ): స్టార్‌ రెజ్లర్‌ దీపక్‌ పూనియా పారిస్‌ ఒలింపిక్‌ ఆశలు గల్లంతయ్యాయి. ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్‌ వరల్డ్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీ తొలి రౌండ్‌లో ఓడి విశ్వక్రీడల అవకాశాన్ని అతడు చేజార్చుకున్నాడు. మరోవైపు యువ రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ అంచనాలను నిలబెట్టుకొని 57 కి. విభాగంలో సెమీ్‌సలో నెగ్గి పారిస్‌ టిక్కెట్‌ దక్కించుకున్నాడు. శనివారం రాత్రి జరిగిన సెమీ్‌సలో అమన్‌ 12-2తో చాంగ్‌సాంగ్‌ హాన్‌ (ఉత్తరకొరియా)ను చిత్తు చేసి విశ్వక్రీడలకు అర్హత సాధించాడు. 65కి.ల సెమీ్‌సలో సుజీత్‌ కల్‌కల్‌ 1-6తో మంగోలియాకు చెందిన బలమైన ప్రత్యర్థి తుల్గా చేతిలో ఓడిపోయాడు. అయితే ఆదివారం అతడు రెండు బౌట్లలో విజయం సాధిస్తే పారిస్‌ బెర్త్‌ లభిస్తుంది. తొలి బౌట్‌లో యుషెన్‌ లిన్‌ (చైనా)పై ఆధిక్యంలో ఉండీ 4-6తో దీపక్‌ పూనియా పరాజయం పాలయ్యాడు. 57 కేజీల విభాగంలో అమన్‌ మొదటి బౌట్‌లో 10-4తో వాలెంటినోవ్‌ను చిత్తు చేశాడు.

Updated Date - May 12 , 2024 | 01:56 AM