Share News

చోరీ చేసి పారిపోయిన పాక్‌ బాక్సర్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 06:03 AM

ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో పాల్గొనడానికి ఇటలీ వచ్చిన పాకిస్థాన్‌ బాక్సర్‌ జొహైబ్‌ రషీద్‌ కనిపించకుండా పోయాడు. సహచరి బ్యాగునుంచి డబ్బు దొంగిలించిన అతడి ఆచూకీ తెలియడంలేదని పాకిస్థాన్‌ బాక్సింగ్‌..

చోరీ చేసి పారిపోయిన పాక్‌ బాక్సర్‌

కరాచీ: ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో పాల్గొనడానికి ఇటలీ వచ్చిన పాకిస్థాన్‌ బాక్సర్‌ జొహైబ్‌ రషీద్‌ కనిపించకుండా పోయాడు. సహచరి బ్యాగునుంచి డబ్బు దొంగిలించిన అతడి ఆచూకీ తెలియడంలేదని పాకిస్థాన్‌ బాక్సింగ్‌ సమాఖ్య తెలిపింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు పేర్కొంది. ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో రషీద్‌ కాంస్యం సాధించాడు. మహిళా బాక్సర్‌ లారా ఇక్రమ్‌ ప్రాక్టీ్‌సకు వెళ్లినప్పుడు.. ఆమె గదిలోకి చొరబడి పర్సులోని విదేశీ కరెన్సీని దొంగిలించి పారిపోయాడట. విదేశాల్లో మెరుగైన జీవితం కోసం పాక్‌ అథ్లెట్లు ఇలా కనిపించకుండా పోవడం తరచూ జరుగుతోంది. ఇటీవల ఆదేశ ఎయిర్‌ హోస్టె్‌సలు కూడా ఇలా ఆచూకీ లేకుండా మాయమయ్యారనే వార్తలు కూడా వచ్చాయి.

Updated Date - Mar 06 , 2024 | 06:03 AM