పాక్ గట్టెక్కింది
ABN , Publish Date - Jun 17 , 2024 | 04:43 AM
టీ20 వరల్డ్‌క్‌పను పాకిస్థాన్ జట్టు విజయంతో ముగించింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తమ చివరి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కాస్త తడబడినా చివరకు 3 వికెట్ల తేడాతో నెగ్గి పాక్ ఊపిరిపీల్చుకుంది...

ఐర్లాండ్‌పై విజయం
లాడర్‌హిల్: టీ20 వరల్డ్‌క్‌పను పాకిస్థాన్ జట్టు విజయంతో ముగించింది. ఆదివారం ఐర్లాండ్‌తో జరిగిన తమ చివరి గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో కాస్త తడబడినా చివరకు 3 వికెట్ల తేడాతో నెగ్గి పాక్ ఊపిరిపీల్చుకుంది. కెప్టెన్ బాబర్ ఆజమ్ (32 నాటౌట్) కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పాక్ ఇప్పటికే సూపర్-8కు చేరకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ముందుగా ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 106 పరుగులు చేసింది. డెలాని (31), లిటిల్ (22 నాటౌట్), అడెయిర్ (15) మాత్రమే రాణించారు. పాక్ పేసర్ల ధాటికి 32/6 స్కోరుతో కష్టాల్లో పడిన జట్టును డెలాని ఆదుకున్నాడు. చివర్లో లిటిల్ పోరాటంతో స్కోరు వంద పరుగులు దాటింది. ఇమాద్ వసీమ్, షహీన్‌లకు మూడేసి, ఆమిర్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్వల్ప ఛేదనలో పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. బాబర్ కీలక ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్ల పదునైన బంతులకు ఓ దశలో పాక్ 57/5 స్కోరుతో ఓటమి తప్పదా అనిపించింది. కానీ బాబర్‌కు జతగా అబ్బాస్ ఆఫ్రిది (17) నిలవడంతో ఏడో వికెట్‌కు 33 రన్స్ వచ్చాయి. ఇక చివరి రెండు ఓవర్లలో 12 రన్స్ అవసరమైన వేళ కాస్త ఉత్కంఠ నెలకొంది. అయితే 19వ ఓవర్‌లో రెండు సిక్సర్లతో షహీన్ (13 నాటౌట్) మ్యాచ్‌ను ముగించాడు.
పాయింట్ల పట్టిక గ్రూప్-ఎ
జటు మ్యా గె ఓ ఫ.తే పా రన్‌రేట్
భారత్ 4 3 0 1 7 1.137
అమెరికా 4 2 1 1 5 0.127
పాకిస్థాన్ 4 2 2 0 4 0.294
కెనడా 4 1 2 1 3 -0.493
ఐర్లాండ్ 4 0 3 1 1 -1.293
ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి; పా: పాయింట్లు